చెరువుల పునరుద్దరణ పనులకు రూ.2 కోట్ల 43 లక్షలు మంజూరు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ పనుల నిమిత్తం
దిశ,వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ పనుల నిమిత్తం రూ.2 కోట్ల 43 లక్షలు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గం లోని పెద్దమందడి పెద్ద చెరువుకు రూ.ఒక కోటి 12 లక్షలు,పెద్దమందడి మండలం దొడగుంటపల్లి చెరువుకు రూ.76 లక్షలు,వెల్టూరు చెరువుకు రూ. 66.50 లక్షలు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు.చెరువు పునరుద్దరణ పనులు పూర్తి చేయడం ద్వారా 1500 నుంచి 2 వేల ఎకరాలకు నిరాటంకంగా సాగునీరు అందించవచ్చు అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.