ప్రతి కాలనీలో మౌళిక వసతులను కల్పిస్తాం
పట్టణంలోని ప్రతి కాలనీలో మౌళిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణంలోని ప్రతి కాలనీలో మౌళిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని 12 వ వార్డులో 50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లను ఆయన ప్రారంభించారు. అలాగే 80 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 13వ వార్డులో 30 లక్షల నిధులతో సీసీ రోడ్డు,10 లక్షలతో నిర్మించిన మహిళా కమ్యూనిటీ భవన్,20 వ వార్డులో 102.30 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో పట్టణాభివృద్ధి ఎక్కడిక్కడ ఆగిపోయిందని,ప్రధాన రహదారికి మాత్రం రంగులు వేసి ఇదే అభివృద్ధి అని పబ్లిసిటీ ఇచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య,వైద్యం,ఉపాధి,అభివృద్ధిల పైనే దృష్టి సారించి,అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,కౌన్సిలర్ ఉమర్,శ్యామ్యుల్ దాసరి,అజ్మత్ అలి,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,ఇంజనీరింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.