ప్రజాసమస్యలు సత్వరమే పరిష్కారం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

Update: 2025-01-06 11:13 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 47 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగరావు లతో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు.వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News