నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం కృషి చేస్తానని,గ్రామాలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించేడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-07 13:58 GMT

దిశ, కల్వకుర్తి : నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం కృషి చేస్తానని,గ్రామాలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించేడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కసిరెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల రోడ్లు అభివృద్ధి చేస్తే అందరికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‌ నాయత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంతో పాటు..నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News