మంచి నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..
మండల పరిధిలోని రామాపూర్ గ్రామంలో తాగునీటి కోసం ఖాళీ
దిశ, కొల్లాపూర్: మండల పరిధిలోని రామాపూర్ గ్రామంలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బుధవారం రోడ్డు పై మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రామాపూర్ గ్రామపంచాయతీ లోని ఏడవ వార్డు కాలనీ మహిళలు,ఆ వార్డు ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు.వీరి నిరసన కార్యక్రమానికి గ్రామ సామాజిక నాయకులు ఆకునమోని చంద్రయ్య యాదవ్ మద్దతును ప్రకటించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సామాజిక నాయకులు చంద్రయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని ఏడో వార్డు కాలనీ తో పాటు మరికొన్ని కాలనీలకు సుమారు నెల రోజులకు పైగా కనీస అవసరాలకు త్రాగునీరు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.
అరకొర నీటితోనే కాలం వెళ్ళదీస్తున్నారని,అయినా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సత్వరమే స్పందించి ఏడవ వార్డు కాలనీ ప్రజలకి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చంద్రయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ లోపు అధికారులు స్పందించి ఏడవ వార్డు కాలనీ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించకుంటే పండుగ తర్వాత కాలనీ ప్రజలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతామని, అప్పటికి స్పందించకుంటే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయం ముందు ప్రజలను సమీకరించుకొని ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపడతామని సామాజిక నాయకుడు ఆకునమోని చంద్రయ్య యాదవ్ హెచ్చరించారు.