ప్రజలతో ఎమ్మెల్యే ముఖాముఖి సమీక్ష సమావేశం
కౌకుంట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర అధికారులు, ప్రజలతో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
దిశ,దేవరకద్ర: కౌకుంట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర అధికారులు, ప్రజలతో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం కౌకుంట్ల రైతు వేదిక దగ్గర వివిధ గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కౌకుంట్ల మండలంలోని 12 గ్రామ పంచాయతీల ప్రజలతో ఎమ్మెల్యే గ్రామాల వారిగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలల్లో ముఖ్యంగా తాగునీటి సమస్య, లోవోల్టేజ్ జి సమస్య, డ్రైనేజీ, సిసి రోడ్ల ,సమస్యలు ఉన్నట్లుగా ఆయా గ్రామ ప్రజలు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, టిపిసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, కురుమూర్తి దేవాలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, యువజన అధ్యక్షుడు నరేష్, మాజీ ఎంపీటీసీ అంజనేయులు, ఎంపీడీవో శ్రీనివాసరావు, తాహసిల్దార్ కృష్ణయ్య, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.