పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి పరుస్తాం

మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-07 14:27 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 10 వ వార్డులో 58.50 లక్షల నిధులతో సీసీ రోడ్డు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన,హై మాస్ట్ లైట్ల ప్రారంభోత్సవం, 22 వ వార్డు లో కోటి లక్షా 41 వేల రూపాయలతో,45 వ వార్డుల్లో 89.42 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు,వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో పట్టణాన్ని అభివృద్ధి చేయలేదని,ఒక సంవత్సర కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలో 120 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన అన్నారు. ప్రతి కాలనీల్లో మౌలిక వసతులతో పాటు,విద్య,వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,సిరాజ్ ఖాద్రీ,కౌన్సిలర్ రస్మిత,ప్రశాంత్, కృష్ణకాంత్ రెడ్డి,ఇంజనీర్ బస్వరాజు,డిఇ నర్సింహ,ఏఈ వైష్ణవి,తదితరులు పాల్గొన్నారు.


Similar News