సైన్స్ ఫెయిర్‌లో ప్రోటోకాల్ రగడ..

నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి

Update: 2025-01-03 04:47 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు స్థానిక చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ప్రారంభం కానున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రోటోకాల్ రగడకు దారి తీసింది. ప్రోటోకాల్ పాటించకుండా ముఖ్య మంత్రి, జిల్లా ఎమ్మెల్యే లను ప్రజాప్రతినిధులను అవమానపర్చారని, ఫ్లెక్సీ లో ఫొటోస్ వేయకపోవడం ఏమిటని పేర్కొంటూ డీఈఓ మరియు విద్యా శాఖ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అన్ని తెలిసిన ఉపాధ్యాయులు, విద్యా శాఖ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ మాధవ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు సైన్స్ ఫేర్ నిర్వాహకులను ప్రోటోకాల్ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంపై ప్రశ్నించారు. కాంగ్రెస్ ఫిర్యాదు తో ఫ్లెక్సీ ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


Similar News