ఖాతాలో మాయమైన డబ్బులు ఈ నెల చివరి నాటికి రికవరీ..
అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ లో
దిశ,అచ్చంపేట : అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ లో దాచుకున్న ఖాతాదారుల డబ్బులు మాయం చేసిన విషయం కలకలం మైన సంగతి తెలిసిందే. మొత్తం 21 మంది అకౌంట్ లో దాచుకున్న ఖాతాదారుల డబ్బులు సుమారు రూ. కోటికి పైగా మాయం చేయగా అందులో నుండి ముగ్గురికి మాత్రమే డబ్బులు రికవరీ చేసిన ఆగనుడు 18 మందికి సంబంధించిన అకౌంట్ లో నుంచి రూ. 95 లక్షలు బ్యాంకులో పనిచేస్తున్న క్లర్క్ కిరణ్ అనే ఉద్యోగి ఖాతాదారులకు తెలియకుండానే నేరుగా అకౌంట్ లో ఉన్న డబ్బులను మాయం చేశాడు. ఈ విషయంపై శనివారం ఎన్నారై అడ్వైజర్ కమిటీ మెంబర్ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖాతాదారులతో కలిసి బ్యాంకు మేనేజర్ ని కలిసి ఎప్పటి వరకు ఖాతాదారులకు సెటిల్మెంట్ చేస్తారని ఆయన మేనేజర్ ను ప్రశ్నించారు.
ఈనెల చివరి నాటికి ఖాతాదారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం..
ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ హుస్సేన్ భాష మీడియాతో మాట్లాడుతూ 21 మధ్యలో ముగ్గురికి సెటిల్మెంట్ కాగా మిగిలిన 18 మంది ఖాతాదారులకు సంబంధించిన రూ. 94 లక్షలు ఉండగా ఈ అందరికీ వడ్డీ 5 లక్షలకు పైగా చెల్లించేలా బ్యాంక్ రీజినల్ మేనేజర్, హైదరాబాద్ ప్రధాన బ్రాంచ్ కి ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఈనెల చివరినాటికి అందరికీ ఖాతాలో వడ్డీతో సహా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మేనేజర్ వివరించారు.