ఆరుతడి పద్ధతిలో పంటలకు నీరందిస్తాం : మంత్రి జూపల్లి

చిన్నంబావి మండలంలోని చిన్న మారు లిఫ్ట్ నుండి నీరు అందక

Update: 2025-01-02 15:18 GMT

దిశ,చిన్నంబావి: చిన్నంబావి మండలంలోని చిన్న మారు లిఫ్ట్ నుండి నీరు అందక పంటలు ఎండుతున్న విషయం మంత్రి జూపల్లి కృష్ణారావు, కు చేరగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కాలువల వెంట తిరిగారు. కాల్వల దుస్థితిని చూసిన మంత్రి వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న చిన్న మారు లిఫ్టును ఐదో తేదీన ప్రారంభించి ఆరుతడి పద్ధతిన పంటలకు నీరందిస్తామని మంత్రి తెలిపారు.

కాలువల వెంట తిరుగుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసిీ కృష్ణ ప్రసాద్ యాదవ్, సీనియర్ నాయకులు బిచుపల్లి యాదవ్, యువ నాయకులు కొత్త కళ్యాణ్ రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగారి శ్రీను, యువ నాయకులు తేజారెడ్డి, వడ్డేమాన్ బిచ్చన్న, నరేష్ యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ జగదీష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News