వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం.. TPCC ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ అన్నారు.
దిశ, మహబూబ్ నగర్: రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నూతన కమిటీలు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి ప్రమాణా స్వీకారం ఉంటుందని తెలిపారు.స మావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్,ఎ స్సీసెల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.