రేపు ఉగాది కవి సమ్మేళనం.. ఎక్కడంటే..?

లుంబిని హైస్కూల్‌,మా ఆకృతి హైస్కూల్‌,పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక లుంబిని పాఠశాలలో కవి సమ్మేళనం,పొర్ల లింగప్ప రచించిన 'పరమాత్మ దర్శనం' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రముఖ కవి,పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు

Update: 2025-03-27 14:31 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ :లుంబిని హైస్కూల్‌,మా ఆకృతి హైస్కూల్‌,పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక లుంబిని పాఠశాలలో కవి సమ్మేళనం,పొర్ల లింగప్ప రచించిన 'పరమాత్మ దర్శనం' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రముఖ కవి,పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా,పాఠశాల అకాడమిక్ అడ్వైజర్ కె.లక్ష్మణ్ గౌడ్ సభాధ్యక్షత వహిస్తారని,ప్రముఖ న్యాయవాది వి.మనోహర్ రెడ్డి,జి.రఘు,డా.వంగీపురం శ్రీ నాథచారిలు పాల్గొంటారని ఆయన తెలిపారు. కవులు,సాహితీ ప్రియులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News