దిశ ఎఫెక్ట్ : నాలుగేళ్లలో నిర్వాసిత సమస్యలు పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే
నియోజకవర్గంలో ప్రాజెక్టుల కింద ముంపుకు గురైన గ్రామాలకు (ఆర్ ఆర్ )పునరావాసం కేంద్రాల ఏర్పాటు వసతుల కల్పన కల్పించడానికి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తో పోరాటం చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు

దిశ, మక్తల్: నియోజకవర్గంలో ప్రాజెక్టుల కింద ముంపుకు గురైన గ్రామాలకు (ఆర్ ఆర్ )పునరావాసం కేంద్రాల ఏర్పాటు వసతుల కల్పన కల్పించడానికి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తో పోరాటం చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. “ముంపు గ్రామాలకు నష్టపరిహారం అందేదిప్పుడో “శనివారం రోజు వచ్చిన వార్తకు ఎమ్మెల్యే స్పందిచారు. మండల పరిదిలోని గడ్డంపల్లి గ్రామంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రామాయణ చరిత్రను లోకానికి అందించిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్నదమ్ముల మైత్రి వారి మధ్య బంధం, తల్లిదండ్రుల మాట జవదాట కపోవడం, ప్రజల అభిప్రాయాన్ని వేదవాక్కులు తీసుకుని పరిపాలించిన మహనీయుడు శ్రీరామచంద్రుని, చరిత్ర అందించిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం సంతోషకరమైందన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిన అందులో భాగంగా మక్తల్ నియోజకవర్గంలో సంగంబండ, బూత్పుర్, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినందు వల్లనే నియోజకవర్గంలో లక్షలాది ఎకరాల బీడు భూములు సాగు బడిలోకి తీసుకొచ్చారని, ఆ తర్వాత వచ్చిన బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వాసిత ప్రజలకు కావాల్సిన కనీస పునరావాసం కల్పించడంలో శ్రద్ధ తీసుకో లేదని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ముంపు గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వీరి బాధలను తమ ప్రభుత్వం గుర్తించింది అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో ముంపు గురైన గ్రామాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, తన కాల పరిమితి లోపు నిర్వాసితులందరికి పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ అన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొండయ్య, కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ గడ్డంపల్లీ హన్మంతు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.