సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తజన సందోహం

నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు అటవీ ప్రాంతం కొండ కోనల మధ్య వెలసిన సలేశ్వరం లింగమయ్యను మొదటిరోజు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది

Update: 2025-04-12 03:46 GMT
సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తజన సందోహం
  • whatsapp icon

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు అటవీ ప్రాంతం కొండ కోనల మధ్య వెలసిన సలేశ్వరం లింగమయ్యను మొదటిరోజు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తజన సందోహం ఉత్సాహంగా వడివడిగా కొండలను గుట్టలను దాటుతూ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయే వరకు భారీ ఎత్తున భక్తులు లింగమయ్య దర్శనం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. నల్లమల్ల అడవుల్లో సలేశ్వరం లింగమయ్య దారి పొడవున హర హర మహదేవ శంభో శంకర అంటూ భక్తులు బిగ్గరగా కేకలు వేస్తూ లింగమయ్య దర్శనానికి పరిగెడుతున్నారు.

పోటెత్తిన భక్తజన సందోహం...

సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రతి ఏడాది చైత్రమాసం నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు ఇష్టంగా కొలిచే శివయ్య క్షేత్రాలను దర్శించుకున్న ఆనవాయితీ అనాదిగా కొనసాగుతున్నది. గతంలో వారం రోజులకు పైగా ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో... నేడు రిజర్వ్ టైగర్ అటవీశాఖ ఆంక్షలతో మూడు రోజులకు కుదించడంతో ఒక్కసారిగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వెళుతున్నారు. రెండు కొండల మధ్యన ఇరుకైన దారిలో పాదయాత్రగా వెళుతు అలసిన ప్రాణాలకు ఎత్తైన కొండ నుండి పారుతున్న జలపాతాన్ని తాకిన భక్తులకు తన బాధను మైమరుస్తూ ఆహ్లాదంతో వైభరిసిపోతూ వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం అంటూ శివయ్య దర్శనం చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా అటవీశాఖ పోలీసులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఐదు మంది సీఐలు 20 మంది ఎస్ఐలు మొత్తం 270 మంది పోలీసుల సహకారంతోపాటు, వందమంది అటవీశాఖ అధికారులు మరో 150 మంది వాలంటీర్లతో ట్రాఫిక్ నియంత్రణ తో పాటు ప్లాస్టిక్ నియంత్రణ చేసేందుకు భక్తులకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ తమ సిబ్బందికి తగిన సూచనలు సలహాలు చేస్తున్నారు. భక్తులు కూడా పోలీసు అడవి శాఖ వారికి సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తావన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ వారు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

నేడు రేపు మరింత క్రౌడ్ పెరిగే అవకాశం..

శని, ఆది, సోమ వారము వరుసగా మూడు రోజులు వీకెండ్ సెలవులు రావడంతో భక్తులు సలేశ్వరం జాతరకు మరింత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. చైత్ర మాసం నిండు పౌర్ణమి శనివారం అర్ధరాత్రి పౌర్ణమి నేరుగా గుండములో పడుతున్న దృశ్యాలను చూసేందుకు భక్తులు మరింత ఆసక్తి చూపుతారు కావున ఆ అరుదైన సంఘటన కోసం లక్షలాది మంది జనం శనివారం రాత్రి వరకు మరింతగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్నది. అందుకు తగ్గట్టుగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గత ఏడాది మాదిరిగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు తెలుపుతున్నారు.

Similar News