ఒకే నెలలో రెండు సార్లు దర్శనం ఇచ్చిన పెద్దపులి..

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అమ్రాబాద్ మండలం ఏటీఆర్ రిజర్వ్ టైగర్ అడవుల్లో అటవీ శాఖ వారు నల్లమల్ల అందాలను తిలకించేందుకు ఆన్లైన్ ద్వారా సఫారీ యాత్ర కొనసాగిస్తుంది.

Update: 2024-12-28 09:12 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అమ్రాబాద్ మండలం ఏటీఆర్ రిజర్వ్ టైగర్ అడవుల్లో అటవీ శాఖ వారు నల్లమల్ల అందాలను తిలకించేందుకు ఆన్లైన్ ద్వారా సఫారీ యాత్ర కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం టూరిస్టులు సఫారీ వాహనంలో నల్లమల్ల అందాలను, పకృతి సృష్టిని తిలకిస్తూ సంచారం చేస్తుండగా ఆ వాహనానికి ఫరహాబాద్ సమీపంలో ఉన్న పెద్దపులిని విజిటర్స్ చూసి మా జన్మ మరింత ధన్యమైందని యాత్రికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే నెలలో 18న కూడా టూరిస్టులు పెద్దపులిని చూసిన సందర్భం నెలకొన్నది.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య మరింతగా పెరుగుతుండడం.. అందుకు తగినట్టుగానే అటవీ శాఖ ఉన్నతాధికారులు సైతం తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో యాత్రికులు చాలా సులువుగా పెద్దపులులను చూసే అదృష్టం కలుగుతుంది. అటవీ శాఖ అధికారులు పకృతి ప్రేమికులకు సఫారీ సౌకర్యాలు కల్పించడంతో సాధ్యమవుతుందని యాత్రికులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ యాత్రకు సార్ధకత లభించినట్టుగా తృప్తిని చెందుతున్నారు. యాత్రికులు తమ మొబైల్లో పెద్దపులిని బంధించారు. ఈ విషయాన్ని మన్ననూర్ ఉప అటవీ క్షేత్ర అధికారి రవికుమార్ మధ్యాహ్నం యాత్రికులకు పెద్దపులి కనిపించిన చిత్రాలను అటవీ శాఖ మీడియాకు సంబంధించిన సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు.


Similar News