బాల కార్మికుల కోసం ఆపరేషన్ స్మైల్

జిల్లాలో బాల కార్మికులు,తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,అక్రమ రవాణా కు గురైన చిన్నారులను రక్షించి,వారికి పునరావాసం కల్పించేందుకు జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో 'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు.

Update: 2024-12-28 14:04 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో బాల కార్మికులు,తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,అక్రమ రవాణా కు గురైన చిన్నారులను రక్షించి,వారికి పునరావాసం కల్పించేందుకు జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో 'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రాములు తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లల హక్కులను కాపాడేందుకు పోలీస్ విభాగం,ఇతర సంబంధిత అధికారులతో బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు,బస్ స్టాండ్లు,ఫ్యాక్టరీలు,వాణిజ్య సంస్థలు,ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు చర్యలు చేపడతారని ఆమె తెలిపారు. బాల కార్మికులుగా బాధపడుతున్న పిల్లలను రక్షించడం,సమాజ పునాదులను బలోపేతం చేయడంలో కీలకమైన చర్య అని,వారి భవిష్యత్తును రక్షించడం ద్వారా సమాజంలో ఒక శక్తివంతమైన మార్పును తేవచ్చని ఆమె అన్నారు. చైల్ఢ్ లైన్ 1098,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,స్వచ్చంద సంస్థల ద్వారా వారికి తక్షణ సహాయం అందించబడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల హక్కులు కాపాడుతూ,వారి భవిష్యత్తు మెరుగు తీర్చే దిశగా ముందడుగు వేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మెన్ నయిమోద్ధీన్,జెజెబీ ఛైర్పర్సన్ గ్రెస్,తదితర పోలీసులు,అధికారులు,పాల్గొన్నారు.


Similar News