మహిళలు పనిచేసే చోట వేధింపులు ఉంటే ఫిర్యాదు చేయండి
నేటి సమాజంలో మహిళల రక్షణకు ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: నేటి సమాజంలో మహిళల రక్షణకు ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్ డిపోలో ఆమె న్యాయ అవగాహన సదస్సును నిర్వహించి మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నవని,అయినా భయం,సిగ్గు,బిడియం,పరువుతో మహిళలు బయటకు చెప్పుకోకుండా భరిస్తున్నారన్నారు. ఇందుకు 2013 లో కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు 'సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్' చట్టం తీసుకువచ్చింది ఆమె తెలిపారు. మహిళలు ఎక్కడైనా పని,ఉద్యోగం చదువు కోవడానికి వెళ్ళినా రక్షణ లేకుండా పోతుందని,ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉందని,ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. అందుకు లోక్ అదాలత్ లోని న్యాయవాదులు సలహాలు,సూచనలు ఇస్తారని ఆమె భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎండి అవేజ్,డిపో మేనేజర్ సుజాత,మహిళా కండక్టర్లు,ఆఫీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.