వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే సస్పెండ్: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతోనే పార్టీ క్రమశిక్షణ చర్యలలో భాగంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.
దిశ, జడ్చర్ల: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతోనే పార్టీ క్రమశిక్షణ చర్యలలో భాగంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. బాలానగర్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి ఇచ్చి అన్ని రకాలుగా గౌరవించిందని. అయినప్పటికీ వారు పార్టీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూనే వచ్చారన్నారు. సస్పెన్షన్ వేటు వేసిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలకు దిగడం దురదృష్టకరమని అన్నారు.