సర్పంచ్‌కు వ్యతిరేఖంగా ఒక్కటైన గ్రామ ప్రజలు..
మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం మండలంలోని నామాలపాడు , కొత్తపేట గ్రామాలలో తయారయ్యే ఇటుకలకు ఓ ప్రత్యేకత ఉంది.
దిశ: బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం మండలంలోని నామాలపాడు , కొత్తపేట గ్రామాలలో తయారయ్యే ఇటుకలకు ఓ ప్రత్యేకత ఉంది. నాణ్యమైన ఇటుకలుగా ప్రసిద్ది ఈప్రాంతలో తయారైన ఇటుకలను, చుట్టు పక్కల జిల్లాలకు నిర్మాణ రంగ తయారి దారులు తీసుకువెళ్తుంటారు. ఈ ప్రాంతంలో సుమారుగా 40 చిన్న పరిశ్రమలను ( ఇటుక బట్టీలు ) యజమానులు తమ జీవనం గడుపుతూ పలువురికి ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి జీవనోపాధి కల్పించడం పరిపాటిగా మారింది.
గత 30 సంవత్సరాల నుండి ఏనాడు ఇటుక బట్టీల అనుమతులపై గ్రామ సర్పంచ్ లు ఏజెన్సీ చట్టాల సంఘాల నాయకులు అడ్డు తగల లేదు . చిన్న పరిశ్రమలు ఏర్పడటం వల్ల 6 వేల మందికి ఇక్కడ పనులు దొరికి, తమ జీవన బృతి ఇక్కడే ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలవారికి బట్టీలు తోడ్పాటునిస్తున్నాయి.
నామాల పాడు సర్పంచ్ కు వ్యతిరేకంగా ఒక్కటైన గ్రామ ప్రజలు
బయ్యారం మండలం పూర్తిగా ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతం, మండలంలోని నామాల పాడు పంచాయతీ సర్పంచ్ కుంజ కిరణ్ గతంలో గ్రామ ఏక గ్రీవ తీర్మానం ద్వారా సర్పంచ్‌గా ఎన్ను కోవడం జరిగింది. గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా సర్పంచ్ ప్రవర్తించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అక్కడ గతంలో అనేక సంవత్సరాలుగా, గిరిజనులు , ఆదివాసుల ,గిరిజనేతరులు ఇటుక పరిశ్రమలు నెలకొని ఉండటం తో గతంలో లేని ఆంక్షలను ఇప్పటి సర్పంచ్ ఎందుకు చేస్తున్నాడో అర్దం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గిరిజనేతరుల బట్టీలకు పంచాయతీ అనుమతి ఇవ్వనంటే, పీసా గ్రామ సభ తీర్మానం చేసి ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేసినట్లు అక్కడి ఇటుక బట్టీ దారులు తెలిపారు. దీంతో మంగళవారం నామాల పాడు పంచాయితి ప్రజలు సర్పంచ్ కుంజ కృష్ణ లేకుండా నే వారికి వ్యతిరేకంగా గ్రామ సభ సమావేశం జరిగింది. పీసా గ్రామ కమిటీ చైర్మన్ ఈసం రాంమూర్తి అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆదివాసులు, గిరిజనులు ఇక్కడ ఇటుక బట్టీలు ఉండాలని వాటికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు . ఇటుక బట్టీల ద్వారా మా జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఉందని , ఇక్కడ పరిశ్రమలు లేకుంటే మేము ఎట్లా బతకాలని, ఇక్కడ బట్టీలు నడవకుండా చేసి , ఏ పట్టణానికి మేము వలస వెళ్లాలని, సర్పంచ్ సమాదానం చెప్పాలని ప్రశ్నించారు . దీంతో ఇటుక బట్టీలు మూసి వేయకుండా వాటికి అనుమతులు ఇతర జిల్లా అధికారులు మంజూరి చేయాలని పీసా గ్రామ తీర్మానం ఏక గ్రీవంగా స్థానిక ప్రజలు , వార్డు సభ్యులు 8 మంది ఉండగా 6 గురు ఆమోదం చేశారు.
పీసా గ్రామ కమిటీ చైర్మన్ : ఈసం రాంమూర్తి
నామాలపాడు ఇటుక బట్టీల అనుమతులపై గత కొన్ని రోజులుగా సర్పంచ్ , కొంత మంది దోబూచులాట ఆడుతున్నారని , బట్టీలు నడవాలా వద్దా అనే దానిపై గ్రామ సభ పీసా సమావేశం ఏర్పాటు వారి తీర్మానం మేరకు దీని ప్రతులను జిల్లా కలెక్టర్ కు , పంచాయతీ అధికారులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బట్టీలు నడవడం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో వెనుక బడిన అన్ని వర్గాల వారికి కూలీ పనులు దొరుకుతాయని బట్టీల వల్ల ఎవరికి ఇబ్బందులు లేవని మాకు జీవనం గడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఉప సర్పంచ్ విజయ్ , వార్డు మెంబర్లు ఉమ, సుధాకర్, లవ్ కుమార్, చీమల కృష్ణ, కమల , గ్రామ దొర , పటేల్ వర్స కృష్ణ తదితరులు పాల్గొన్నారు.