టెండర్‌లో దోబూచులాట..మూడు నెలలు గడిచిన కొలిక్కిరాని వైనం

పలు రకాల జబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

Update: 2024-11-25 03:37 GMT

దిశ,వనపర్తి టౌన్: పలు రకాల జబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టెడు అన్నం పెట్టడం కోసం డైట్ నిర్వహణ నిర్వర్తిస్తుంది. కాగా వనపర్తి జిల్లా జనరల్ హాస్పిటల్ లో గత మూడు దశాబ్దాలుగా డైట్ నిర్వహణ కొనసాగుతూ వస్తోంది. డైట్ నిర్వహణ బాధ్యతను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా అనుభవం కలిగిన సంస్థలకు అప్పజెప్పడం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆ సంస్థ పనిచేస్తోంది. ఈ పద్ధతి ప్రతి రెండు సంవత్సరాల వరకు కాల పరిమితి ఉంటుంది. అయితే కాల పరిమితి అయిపోయిన వెంటనే కొత్త టెండర్ కు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. టెండర్ లో అనుభవమైన సంస్థలు పాల్గొని కొన్ని పద్ధతిలో టెండర్ ను దక్కించుకున్న వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇష్యూ చేస్తారు. కొన్ని నిబంధనలకు అనుగుణంగా టెండర్ దక్కించుకున్న వ్యక్తి రోగులకు నాణ్య వంతమైన భోజనం అందించేందుకు కట్టుబడి ఉండాలి . అయితే జిల్లా జనరల్ ఆస్పత్రిలో గత రెండేళ్ల క్రితం 2022 ఆగస్టు మాసంలో టెండర్ దక్కించుకున్న సంస్థ గడువు పూర్తి కావడంతో కొత్త టెండర్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఆగస్టులో జారీ అయింది. మూడు నెలలుగా కొత్త టెండర్ పూర్తి చేయకుండా సాగదీత వెనక దాగి ఉన్న ఆంతర్యం ఏంటో తెలియాల్సింది.

అసలు రహస్యం ఏంటో...?

ఆగస్టులో టెండర్ గడువు పూర్తి కాగా, కొత్త నోటిఫికేషన్ జారీ తో డైట్ టెండర్ ప్రక్రియ కు 12 అప్లికేషన్స్ రాగా, స్క్రూట్నీ లో అప్లికేషన్ పరిశీలించి 8 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించారు. కాగా మిగిలిన నలుగురిలో ఒకరికి టెండర్ అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ ... పలు రకాల కారణాల చేత టెండర్ ను వాయిదాలు వేస్తూ వచ్చారు. దీంతో రెండోసారి కూడా రా టెండర్ ప్రక్రియ నిర్వహించారు. ఒక్క టెండర్ ఫామ్ కు పదివేల చొప్పున టెండర్ దారులు మొదట్లో చెల్లించారు. మరల టెండర్ ఫామ్ కు డబ్బులు ఇవ్వాలని అధికారులు చెప్పడంతో టెండర్ దారులు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రీటెండర్ లో 9 దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత నెలలో 9వ తేదీన నిర్వహించిన టెండర్ ప్రక్రియలో 12 దరఖాస్తులు దాఖలైనట్లు, అందులో 8 మందిని అనర్హులుగా గుర్తించారు.

గతంలో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో సీల్డ్ కవర్ లో ఎవరైతే తక్కువగా దాఖలు చేస్తారో వారికి కేటాయించడం జరుగుతుంది. ప్రతి హెడ్ కు 80 చొప్పున ధర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను తక్కువగా దాఖలు చేసే వారికే ప్రాధాన్య ఇస్తారు. ప్రతి హెడ్ కు తక్కువ ధర కు దాఖలు చేసిన వారికి టెండర్ దక్కించుకోవడం జరుగుతోంది. ఇటీవల అర్హులు గా ఉన్న వారు టెండర్ దక్కకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నట్లు వినికిడి. ఉన్నతాధికారులు, కమిటీ నిర్వాహకులు అనుకుంటే జాప్యం లేకుండా జరగాల్సిన డైట్ టెండర్ ప్రక్రియ ఎప్పుడో ఖరారు అయ్యింది. సాగదీత ధోరణి పై పలు అనుమానాలకు తాగునిస్తోంది. అకారణాలవల్ల కాలయాపన గా డైట్ నిర్వహణను కొనసాగిస్తున్నారంటూ టెండర్ దారులు ఆరోపిస్తున్నారు.

టెండర్ లో ఏ పద్ధతి వర్తిస్తదో...!

గతంలో డైట్ టెండర్ ఎంపిక ప్రక్రియ సిల్ట్ కవర్ పద్ధతి నిర్వహణ చేస్తే వారు. అయితే సిల్ట్ కవర్ పద్ధతిలో టెండర్ దారుడికి 100% మార్కులు వచ్చినప్పటికీ పోటీ దారుల్లో అనేక అనుమానాలకు తావువ్వడంతో హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ను పలువురు టెండర్ దారులు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ టెండర్ జీవో ప్రక్రియ అవకతవకలు ఉన్నట్లు కమిషనర్ కు విన్నవించినట్టు సమాచారం. దీంతో డైట్ టెండర్ ప్రక్రియ రీ కాల్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఈనెల 19న రీటెండర్ జరిగినట్లు తెలుస్తోంది. సిల్ట్ కవర్ పద్ధతిలో జరుగుతుందా...? లేక డ్రా పద్ధతిలో తీస్తారా అన్నదానిపై సందిగ్ధం.

బిల్లులు చేయాలంటే సవాలక్ష కండిషన్స్....!!

ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్న ఏ కాంట్రాక్టర్ కైనా బిల్లులు చెల్లించాలంటే సవాలక్ష కండిషన్స్ పెడుతున్నారంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వెల్లుబుచ్చుతున్నారు. ఫార్మా కంపెనీ కాంట్రాక్టర్, పారిశుద్ధ్య కాంట్రాక్టర్, డైట్ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి అధికారులు కుంటి సాకులు వెతుకుతూ సవా లక్ష కండిషన్స్ పెడుతున్నారంటూ ఆస్పత్రి పరిసరాలలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫార్మా కాంట్రాక్టర్, పారిశుద్ధ్య కాంట్రాక్టర్ లకు ముందస్తు బడ్జెట్ రిలీజ్ అయినప్పటికీ అయినప్పటికీ సదరు కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి టెండర్ లో ఎలాంటి అవకతవకులకు తావులేకుండా టెండర్ ను వేగవంతం చేసి అర్హులైన వారికి టెండర్ అప్పగించే ప్రయత్నం చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు.


Similar News