తూకంలో తరుగు తీస్తే చర్యలు
పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులను తూకంలో తరుగులు తీస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
దిశ,కొల్లాపూర్: పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులను తూకంలో తరుగులు తీస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని సాతాపూర్, చంద్రకల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో..ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి ధాన్యంకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ కు రూ,2340,సన్నాలకు బోనస్ రూ,500లు చెల్లిస్తుందన్నారు. రైతులు పండించిన పంటను గ్రామాల్లో దళారీలకు అమ్మి మోసపోవద్దని మంత్రి జూపల్లి సూచించారు.
ఈ నెల 27,28,29 తేదీల్లో కొల్లాపూర్ పట్టణంలో జరుగనున్న ఆర్ఐడీ,కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని పట్టణం సుందరీకరణ కోసం హైద్రాబాద్ నుంచి తెప్పించిన ఎంతో ఖరీదైన వివిధ రకాల పూల మొక్కలను నాటుటకు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో సిద్దంగా ఉంచిన పూల మొక్కలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉదయం పరిశీలించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయం నుంచి మేయిన్ రోడ్డు డివైడర్ పొడవునా కాలినడకన ఎన్టీఆర్ చౌరస్తా వరకు మంత్రి జూపల్లి నడిచారు. గతంలో నాటిన అందహీనంగా ఉన్న మొక్కలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు మంత్రి సూచించారు. దీంతో కూలీలతో పాత మొక్కలను తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం అరుణ, మాజీ ఎంపీపీ లు సూర్య ప్రతాప్ గౌడ్,వరద రాజుల వెంకటేశ్వర్ రావు, మాజీ జెడ్పీటీసీ హన్మంతు నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు, కౌన్సిలర్లు నరసింహ రావు, మేకల శిరీష యాదవ్, రహిం పాషా, నహీం, రాముడు యాదవ్,కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, మేకల నాగరాజు, ఖాదర్ బాషా, గోపాల్ రావు,శివ మహేశ్వర్ రావు,మాజీ సర్పంచ్ లు సత్యం, చిన్నయ్య, లక్ష్మణరావు,చంద్ర య్య యాదవ్ తదితరులు ఉన్నారు.