పామిరెడ్డిపల్లిలో కొండచిలువ కలకలం
మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది.
దిశ,పెద్దమందడి: మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది. సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇల్లు గ్రామ చివరన వైరాగిచెరువు సమీపంలో ఉంది. ఆదివారం ఉదయం అందరూ చూస్తుండగానే పది అడుగుల కొండచిలువ చెరువులో నుంచి నేరుగా సాయికుమార్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించింది. గమనించిన అతను వనపర్తిలో ఉన్న అసోసియేషన్ ఫర్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ( ఏబిసిడి ) సభ్యులు, సర్పరక్షకుడు డా. బి. సదాశివయ్య శిష్యులు శివకుమార్ కు సమాచారం అందజేశారు. దీంతో శివకుమార్, అభిరామ్ పామిరెడ్డిపల్లికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోగానే గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఏబిసిడి సభ్యులు అభిరామ్, శివ కుమార్ లను అభినందించారు. పట్టుకున్న కొండచిలువను అటవీ అధికారుల సహాయంతో అటవీప్రాంతంలో వదిలేస్తామని తెలిపారు. ప్రజలు పాములు కనిపిస్తే భయభ్రాంతులకు గురికాకుండా తమకు తెలియజేయాలన్నారు.