వైద్యం కోసం ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లక్ష 25వేల రూపాయల ఎల్ఓసి లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెరుగైన వైద్య చికిత్స కోసం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
దిశ, గద్వాల టౌన్ : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లక్ష 25వేల రూపాయల ఎల్ఓసి లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెరుగైన వైద్య చికిత్స కోసం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. నల్లకుంట కాలనీ 21వ వార్డుకు చెందిన శ్రీహిత D/o నవీన్ కుమార్ కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన 1లక్ష 25 వేల రూపాయల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.