దొంగల హల్‌చల్.. నాలుగు ఇళ్లలో చోరీకి యత్నం..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు
దిశ,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకేసారి పలు చోట్ల దొంగతనానికి పాల్పడారు. నల్లకుంట, మోయినమల్ల, బుర్దపేట సరిత ఇంటి ముందు ఉన్న తాళం వేసిన ఇండ్లలో చోరికి యత్నించారు. రెండు చోట్ల ఇంటి తాళాలు పలగకపోవడంతో వెనుదిరిగారు. తక్కువ మొత్తంలో చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. గత వారం క్రితం పట్టా పగలే ఒక వృద్ధ మహిళ సంచిలోంచి నగదు దొంగతనానికి పాల్పడగా నేడు నాలుగు ఇళ్లలో చోరీకి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. దీంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నిఘా వ్యవస్థ లోపం కారణంగానే నేరాలు పెరుగుతున్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాత్రి వేళలో నిఘాని పెంచి చోరీకి పాల్పడుతున్న దుండగుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.