ఇంట్లో కారం చల్లి బంగారం, వెండి, సిల్వర్ చోరీ
ఇంట్లో కారం చల్లి 30 నుంచి 40 తులాల బంగారం, 10 కేజీల వెండి, రెండు కేజీల సిల్వర్ ఎత్తుకెళ్లిన ఘటన పెంట్లవెల్లి మండల పరిధిలోని ఎండీ. శంషాద్దీన్ ఇంట్లో మంగళవారం చోటుచేసుకుంది.
దిశ, పెంట్లవెల్లి : ఇంట్లో కారం చల్లి 30 నుంచి 40 తులాల బంగారం, 10 కేజీల వెండి, రెండు కేజీల సిల్వర్ ఎత్తుకెళ్లిన ఘటన పెంట్లవెల్లి మండల పరిధిలోని ఎండీ. శంషాద్దీన్ ఇంట్లో మంగళవారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన కుటుంబ సభ్యులు పనిమీద మహారాష్ట్ర వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కన ఉన్న వాళ్లు ఇల్లు తాళం పగులగొట్టి ఉండడంతో ఇంటి వాళ్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఇంటి యజమానులు ఇంటికి వచ్చి వస్తువులను వెతకగా బంగారం, వెండి, సిల్వర్ మొత్తం కలిపి రూ.10 లక్షల వరకు విలువగల వస్తువులు తీసుకెళ్లారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ సీఐ మహేష్, కొల్లాపూర్ ఎస్సై రిషికేష్, పెంట్లవెల్లి ఏఎస్ఐ వెంకటరెడ్డి, కానిస్టేబుల్ అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.