Revanth Reddy: రైతన్న చరిత్రను తిరగరాసింది ఈ రోజే.. సీఎం ఆసక్తికర ట్వీట్
ఇదే రోజు రైతు వేసిన ఓటు రైతన్న చరిత్రను తిరగరాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఇదే రోజు రైతు వేసిన ఓటు రైతన్న చరిత్రను తిరగరాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏడాది పాలన పూర్తి అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఉత్సవాలు(Celebrations) జరుపుతోంది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్(Mahaboob Nagar)లో రైతు విజయోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతు(Poling Booth)కు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని(Vote) తెలిపారు.
ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని చెప్పారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్.. రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్.. రూ.1433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు రైతులకు అందించినట్లు చెప్పారు. అంతేగాక ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని, ఇది నెంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకమని స్పష్టం చేశారు. ఇక ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి, రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానని రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా తెలియజేశారు.