గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు.

Update: 2025-03-16 16:46 GMT

 దిశ,ఎర్రవల్లి: గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం,ఇటిక్యాల మండల పరిధిలోని మునగాల గ్రామాలలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 30 కోట్లు పైగా నిధులను అల్లంపూర్ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాలకు మంజూరు చేయడంతో.. నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్క, ఇన్చార్జి మంత్రి దామోదర రాజనరసింహకి సంపత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడి భవనాలు,రోడ్లు, పాఠశాలలో టాయిలెట్లు నిర్మాణం చేపట్టమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎర్రవల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జగన్మోహన్ నాయుడు,ధర్మవరం నారాయణ నాయుడు,రుక్మానందరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి,సాతర్ల జయచంద్ర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News