అక్రమ బెట్టింగ్ యాప్స్ పై ప్రత్యేక నిఘా

జిల్లాలో అక్రమంగా ఆన్ లైన్ బెట్టింగ్,గేమింగ్ యాప్ లపై ఆధునిక సాంకేతికతతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Update: 2025-03-16 16:44 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో అక్రమంగా ఆన్ లైన్ బెట్టింగ్,గేమింగ్ యాప్ లపై ఆధునిక సాంకేతికతతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల యువత,విద్యార్థులు తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో ఈ బెట్టింగ్ యాప్ లలో పాల్గొని,తీవ్రంగా నష్టపోయి,అప్పులపాలై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ అక్రమ బెట్టింగ్ లో కాని,గేమింగ్ లో కాని పాల్గొన్నా,ప్రోత్సహించినా చట్ట పరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న బెట్టింగ్,గేమింగ్ యాప్ లు మోసం చేయడానికే తప్ప,ప్రజలకు మేలు చేయడానికి కావని ఆమె వివరించారు. మీ చుట్టూ ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలు,యువకులు,విద్యార్థులకు సూచించారు. జిల్లాలో యువత ఇలాంటి మోసపూరిత యాప్స్ బారినపడి ఆత్మహత్యల వంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా కాపాడటమే తమ పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ జానకి భరోసానిచ్చారు.


Similar News