collector : అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆకస్మికంగా తనకి చేసి అంగన్వాడి భవనంలో కొత్తగా వేసిన రంగులు, పెయింటింగ్ లను పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించారు.

Update: 2024-07-31 13:26 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆకస్మికంగా తనకి చేసి అంగన్వాడి భవనంలో కొత్తగా వేసిన రంగులు, పెయింటింగ్ లను పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరికీ రెండు జతల యూనిఫామ్ బట్టలను వెంటనే అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. మండలానికి ఒకటి చొప్పున మంచి అంగన్వాడి భవనాన్ని ఎంపిక చేసి ఆ భవనానికి కలరింగ్ తో పాటు ఆకర్షణీయమైన పెయింటింగ్ పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దానన్నారు.

3 సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలామృతంతో పాటు మంచి పౌష్టికాహారం అందజేసి వారి ఎదుగుదలకు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు విద్యుత్ దీపాలతో పాటు దోమలు రాకుండా కిటికీలకు దోమతెరలు (జాలిలు) అమర్చాలన్నారు. సెంటర్ లో త్రాగు నీటితో పాటు మరుగుదొడ్డి నిర్మించేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సుధారాణి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ దామోదర్, డీఈ రాజేష్, ఏఈ బషీర్, ఎంపీడీవో ఉమాదేవి గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News