జీడీపీలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరుల ఉత్పత్తులు వినియోగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

Update: 2025-03-21 02:27 GMT
జీడీపీలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటు
  • whatsapp icon

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరుల ఉత్పత్తులు వినియోగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే. ఈ రెండు అంశాల్లోనూ ఉమ్మడి జిల్లాగా ఉన్న పాలమూరు పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉండగా, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితి అధ్వానంగా ఉంది.

పాలమూరు జిల్లాకు పదవ స్థానం

ఒక సంవత్సర కాలంలో జిల్లాల వారీగా ఉత్పత్తుల, ఆదాయం విషయంలో పాలమూరు జిల్లా రాష్ట్రంలో 32,767 రూపాయలతో పదో స్థానంలో నిలిచింది. నాగర్ కర్నూల్ జిల్లా 23,462 రూపాయలతో 19వ స్థానంలో మిగలగా, వనపర్తి జిల్లా 15,547 రూపాయలతో 26వ స్థానంలోనూ, జోగులాంబ గద్వాల జిల్లా 15,529 రూపాయలతో 27వ స్థానంలోనూ, నారాయణపేట జిల్లా 13,818 రూపాయలతో 30 వ స్థానంలో నిలిచింది. స్థిరాస్తుల బదిలీలు, అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే క్యాపిటల్ ఇన్కమ్ లోను ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్యాపిటల్ ఇన్ కంలో పాలమూరు జిల్లా 2,93,823 రూపాయలతో రాష్ట్రంలో ఆరవ స్థానంలో, నాగర్ కర్నూల్ జిల్లా 29649 రూపాయలతో 20వ స్థానంలో ఉండగా వనపర్తి జిల్లా 2,27,422 రూపాయలతో 22వ స్థానంలో, జోగులాంబ గద్వాల జిల్లా 214,816 రూపాయలతో 26వ స్థానంలో ఉండగా.. నారాయణపేట జిల్లా 2,07, 784 రూపాయలతో రూపాయలతో 30 వ స్థానంలో మిగిలింది.

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోనే మెరుగైన ఫలితాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి జరిగితేనే సంవత్సర ఆదాయం, వస్తువుల వినియోగం, జీవన విధానాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వము ఉమ్మడి పాలమూరు జిల్లా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటి వనరులను మెరుగుపరచాలి. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా క్యాపిటల్ ఇన్కమ్, జీడీడీపీని మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News