కవిత్వం ఉగాది పచ్చడిలా ఉండాలి

కవి కవిత్వం చెపితే ఉగాది పచ్చడి లా తీపి,చేదు,పులుపు,వగరులా ఉండాలని ప్రముఖ న్యాయవాది,జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి.మనోహర్ రెడ్డి అన్నారు.

Update: 2025-03-27 15:06 GMT
కవిత్వం ఉగాది పచ్చడిలా ఉండాలి
  • whatsapp icon

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కవి కవిత్వం చెపితే ఉగాది పచ్చడి లా తీపి,చేదు,పులుపు,వగరులా ఉండాలని ప్రముఖ న్యాయవాది,జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి.మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పారిశ్రామిక వాడలోని ఫోరం కార్యాలయంలో సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కవి కప్పి చెప్పితే కవిత్వం అవుతుందని,విప్పి చెప్పితే విమర్శ అవుతుందని,పచ్చడి తాగితే తెలుగు సంవత్సరాది,మద్యం సేవిస్తే ఇంగ్లీష్ సంవత్సరాదని ఆయన చమత్కరించారు. కవిత్వం నిగూఢ అర్థానిచ్చేదిగా ఉండాలని,హృదయాలను తెరిచే కవాటంలా కావాలని ఆయన అన్నారు.ఈ కవి సమ్మేళనంలో 25 మంది కవులు తమ కవితలను వినిపించారు,వారిని జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్థన్,విద్యావేత్త,కవి కె.లక్ష్మణ్ గౌడ్,ఫోరం అధ్యక్షుడు జగపతిరావు,కార్యదర్శి నస్కంటి నాగభూషణం,పొద్దుటూరి ఎల్లారెడ్డి,ఖాజామైనోద్దీన్,సూర్యనారాయణ,పులి జమున,వనజ,తైలం బాలక్రిష్ణ,ఎ.రాజసింహుడు,తదితరులు పాల్గొన్నారు.

Similar News