ప్లాట్ల క్రమబద్దీకరణకు చివరి మూడు రోజులే అవకాశం

ఎల్ఆర్ఎస్ స్కీం క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కొరకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 31వరకు అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2025-03-27 13:05 GMT
ప్లాట్ల క్రమబద్దీకరణకు చివరి మూడు రోజులే అవకాశం
  • whatsapp icon

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఎల్ఆర్ఎస్ స్కీం క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కొరకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 31వరకు అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎల్ ఆర్ ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నందున జిల్లాలోని అన్ని మున్సిపల్ గ్రామ పంచాయతీలలో ఫీజును చెల్లించి, తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత 25 శాతం రిబేటు వర్తించదని తెలిపారు. ఈ అవకాశం కొద్ది రోజులే ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోనాలన్నారు. చెల్లింపులు చేసిన వారికి రెండు లేదా మూడు రోజులలో అనుమతులు మంజూరు చేయబడతాయని తెలిపారు.

Similar News