గురుకులాలను సద్వినియోగం చేసుకోండి: బీఎస్పీ నేత ఆర్ఎస్పీ
విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
దిశ, ఉండవల్లి: విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. విద్యార్థులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తాను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు విద్యార్థులకు చక్కటి విద్యతో పాటు గురుకులాల అభివృద్ధి కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచిలుకు ముస్లిం మైనారిటీ, బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం అటు నుంచి అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పప్పు శనగ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు చల్లని మజ్జిగ ప్యాకెట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వేసవికాలం దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలువురు ఆయన సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, మహేష్, ప్రభుదాసు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.