ఎన్ఎమ్ఎమ్ఎస్‌కు ఉమ్మడి గండీడ్ మండల విద్యార్థులు ఎంపిక
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ - 2023 సంవత్సరానికి మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలోని... Students selected for N.M.M.S
దిశ, మహమ్మదాబాద్/గండీడ్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ - 2023 సంవత్సరానికి మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలోని పాఠశాలకు చెందిన వెన్నచేడ్ బాలుర పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు, వెన్నచేడ్ మోడల్ స్కూల్ కు చెందిన 11 మంది విద్యార్థులు, చిన్నవార్వాల్ వరకు చెందిన ఒక విద్యార్థి, గండీడ్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు, నంచర్ల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, మండల ప్రాథమికోన్నత పాఠశాల మొకార్లాబాద్ కు చెందిన 4 విద్యార్థులు, మహమ్మదాబాద్ బాలికల పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి ఎంపికైయ్యారు. ఎనిమిదవ తరగతికి చెందిన ఎన్ ఎమ్ ఎమ్ ఎస్ జాతీయ స్థాయి పరీక్షలో ఉమ్మడి గండీడ్ మండల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పలువురు పాఠశాలల హెచ్ ఎమ్ లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంచర్ల హెచ్ఎం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఎంపికయ్యారని హెచ్ ఎమ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి రూ. 12 వేలు కేంద్రప్రభుత్వం నేరుగా విద్యార్థుల అక్కౌంట్లలో జమచేస్తుందని హెచ్ ఎమ్ తెలిపారు. వివిధ పాఠశాల విద్యార్థులు జాతీయ పోటీ పరీక్షల్లో ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాయకులు అభినందనలు తెలిపారు.