నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు..

జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , క్రయ, విక్రయాల పై, పటిష్ట నిఘా ఉంచాలని, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టాలని డీఎస్పీ రంగ స్వామి, వ్యవసాయ శాఖ అధికారికి గోవింద్ నాయక్ లు ఆదేశించారు.

Update: 2023-04-28 11:14 GMT

దిశ, గద్వాల : జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , క్రయ, విక్రయాల పై, పటిష్ట నిఘా ఉంచాలని, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టాలని డీఎస్పీ రంగ స్వామి, వ్యవసాయ శాఖ అధికారికి గోవింద్ నాయక్ లు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డీఎస్పీలు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మే వారి పై నిఘా ఉంచడానికి జిల్లా స్థాయిలో ఇన్స్పెక్టర్, వ్యవసాయ ఏడీఏ ఆధ్వర్యంలో, మండల స్థాయిలో ఎస్సై లు, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశామన్నారు. మే నెల 1 వ తేదీ నుండి సీడ్స్ షాప్స్, మిల్లులు, పర్టీలైజర్ షాప్స్ లలో తనిఖీలు చేపడుతాయని అన్నారు.

టీంలన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పని చేస్తున్నాయని తెలిపారు. జిల్లా సరి హద్దుల్లో 7 చోట్ల ర్యాలం పాడు, పుల్లూరు, రాజోలి, బైరా పురం, ఇర్కి చెడు, నందిన్నె, బలిగెరలో వాహన తనిఖీ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఏ పరిస్థితులలో నకిలీ విత్తనాలు జిల్లాలోకి రావడం, జిల్లా నుండి బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే సర్టిఫైడ్ డీలర్స్ మాత్రమే సీడ్స్ అమ్మేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ సీడ్స్ ను గుర్తించడంలో ప్యాకెట్ పై ఎక్స్పైర్ డేట్, బార్కొడ్, లాట్ నెం, మానిప్యాక్షరింగ్ తేదీలను గుర్తించడం పై సూచనలు చేశారు. ఎస్ఆర్ఎంటీ, నవత ట్రాన్స్పోర్ట్ వాహనాలపై నిఘా ఉంచాలని అన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా, ఉత్పత్తి, రవాణా అయ్యేందుకు అవకాశం ఉన్న మార్గాలను అదికారులకు తెలియజేశారు. పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పకడ్బందీగ చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహ రించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏడీఏలు సక్రియ నాయక్, వెంకట లక్ష్మీ, సంగీత లక్ష్మి, శాంతి నగర్ సీఐ శివశంకర్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సై లు, ఆన్ని మండలాల ఎంఏఓ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News