ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.
దిశ, గద్వాల కలెక్టరేట్ : ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీలలో స్వీయ సహాయ గ్రూపుల (ఎస్ హెచ్ జి ఎస్) నుండి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులను చేర్చాలన్నారు. కమిటీలు స్థానిక ప్రజలకు ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని, లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో అవసరమైన సహాయాన్ని అందించడం, తప్పులైతే వాటిని గుర్తించడం కూడా కమిటీల బాధ్యత అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగరావు పాల్గొన్నారు.