BC Samaj : బీసీ సమాజ్ జడ్చర్ల కన్వీనర్ గా శివాలిలా
బీసీ సమాజ్ తరుపున జడ్చర్ల కన్వీనర్ గా జడ్చర్ల మున్సిపాలిటీ లోని కౌరంపేట్ కి చెందిన శివాలీలను బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ,రాష్ర్ట యూత్ ప్రధానకార్యదర్శి మామిడి మాడ భాస్కర్ లు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
దిశ, జడ్చర్ల : బీసీ సమాజ్ తరుపున జడ్చర్ల కన్వీనర్ గా జడ్చర్ల మున్సిపాలిటీ లోని కౌరంపేట్ కి చెందిన శివాలీలను బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ,రాష్ర్ట యూత్ ప్రధానకార్యదర్శి మామిడి మాడ భాస్కర్ లు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( MLC Theenmar Mallanna )చేతుల మీదుగా శివలీలకు అందజేశారు. ఈ సందర్భంగా శివ లీల మాట్లాడుతూ..ఈ డబ్ల్యూ ఎస్,29 జివో ద్వారా బీసీ యువతా కు బీసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని బీసీ ప్రజలకు అవగాహ కల్పిస్తూ ముందుకు సాగుతానన్నారు. చట్ట సభల్లో జనాభా ప్రకారంగా వాటా, ఉద్యోగాల్లో వాటా కావాలని 33 శాతం మహిళ రిజర్వేషన్లలో బీసీ మహిళా వాటా తెలిపాలని లేకపోతే.. తెలంగాణా ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నదని తెలిపారు. తన మీద నమ్మకంతో నాకు పదవి ఇచ్చినా రాష్ట్ర అధ్యక్షులకు బీసీ సమాజ్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి మామిడి మాడ భాస్కర్ కు తీన్మార్ మల్లన్న కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు శ్రీధర్ మహేశ్వరి పాల్గొన్నారు.