మెరిసిన పాలమూరు ఆణిముత్యం

పాలమూరు పట్టణం నుంచి మరో ఆణిముత్యం మెరిసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త గా మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన కొత్తూరు గ్రీష్మ రెడ్డి ఎంపిక అయ్యింది.

Update: 2024-12-19 10:52 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పాలమూరు పట్టణం నుంచి మరో ఆణిముత్యం మెరిసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త గా మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన కొత్తూరు గ్రీష్మ రెడ్డి ఎంపిక అయ్యింది. పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న కె.శ్రీనివాస్ రెడ్డి,ప్రసన్న దంపతుల ప్రధమ పుత్రిక డాక్టర్ కె.గ్రీష్మ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) నిర్వహించిన, జాతీయ స్థాయి అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచింది. ప్లాంట్ పాథాలజీ' విభాగంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తగా ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తన కుమార్తె గ్రీష్మ రెడ్డి ఎంసెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిందని,అనంతరం మహారాష్ట్రలో ఎంఎస్సీ పూర్తి చేసిందన్నారు. అలాగే ఐకార్ నిర్వహించిన జాతీయ స్థాయి సీనియర్ రిసెర్చ్ ఫేల్లో పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ సాధించిందని ఆయన గర్వంగా చెప్పారు. అనంతరం గ్రీష్మ రెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయ రంగంలో ముఖ్యంగా పంటలను తినేస్తున్న చీడ పురుగుల నివారణ కొరకు శాస్త్రీయమైన పరిశోధనలు జరిపి అన్నదాతలను అందుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.


Similar News