Dasha Effect : కదిలిన జిల్లా యంత్రాంగం
గుండుమాల్ మండలం కొమ్మూరు ప్రైమరీ, ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో ముక్కిపోయిన బియ్యంతో విద్యార్థులకు భోజనం అనే దిశ కథనంతో అధికారులు స్పందించారు.
దిశ, గుండుమాల్: గుండుమాల్ మండలం కొమ్మూరు ప్రైమరీ, ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో ముక్కిపోయిన బియ్యంతో విద్యార్థులకు భోజనం అనే దిశ కథనంతో అధికారులు స్పందించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించి సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరారు. దేవదాస్ జిల్లా మేనేజర్ సివిల్ సప్లై కొమ్ముర్ పాఠశాలను తనిఖీ చేసి మూడు నెలల కిందట వచ్చిన స్టాక్ బియ్యాన్ని పరిశీలించారు. అవి పూర్తిగా ముక్కిపోయి ఉండటంతో పాత బియ్యాన్ని వాడకుండా ఆగష్టు, సెప్టెంబర్ నెలలో వచ్చిన బియ్యాన్ని వాడాలని సూచించారు.
అలాగే వంట మనుషులు ప్రైమరీ, ఉన్నత పాఠశాలకు ఒక్కక్కరే ఉన్నారని, కుక్కర్, హెల్పర్ ఇద్దరు ఉండాలి అని సూచించారు. మెనూ ప్రకారం కూరగాయలు, గుడ్లు, నాణ్యమైనవిగా ఉండాలని, విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత స్టాక్ బియ్యం పై ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఆఫీసు నుండి మిడే మిల్స్ అధికారి యాదయ్య శెట్టి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ హెమ్ల నాయక్, పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.