రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా: ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.
దిశ, మద్దూరు, కొత్తపల్లి: రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. రైతు దినోత్సవ సందర్భంగా శనివారం మద్దూర్ మండల పరిధిలోని రేనివట్ల,పేదిరిపాడ్, పల్లెర్ల గ్రామలలో రైతు వేదిక సంబరాల్లో పాల్గొని రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలందరికీ కేసిఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు.
ముఖ్యంగా రైతన్నలకు దేశంలోనే మొదటిసారిగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను అందజేసిన ఘనత కేసిఆర్ దేనని తెలిపారు. అలాగే మండల పరిధిలోని పలు గ్రామాల క్లష్టర్ల పరిధిలో నిడి జింత, మద్దూరు, బునీడ్, లింగాల్ చేడ్ గ్రామాలలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూచి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పీ ఏ సి యస్ అధ్యక్షుడు బి జగదీశ్వర్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, భార్గవి, కాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More... పాలమూరు పై బీఆర్ఎస్ ఫోకస్.. మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్