పనులు చేసే చేయించుకునే బాధ్యత ప్రజలది.. రాష్ట్ర మంత్రి

Update: 2022-02-23 07:25 GMT

దిశ,వనపర్తి : గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసే బాధ్యత ప్రభుత్వానిది.. చేయించుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బలిజపల్లి, జంగమయ్య పల్లి, పామిరెడ్డిపల్లి, ముందరి తండా, చీకురు చెట్టు తండా, మణిగిల్లా, జగతపల్లి గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిని మంత్రి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి బలిజపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనం, పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు.

ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు. దాంతో పాటు మౌలిక వసతుల కల్పనలో భాగంగా దశలవారీగా గ్రామాలలో సీసీ,బీటీ రహదారులు, విద్యుత్ సరఫరా, వైకుంఠ దామాలతో సహా ఇతర సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులను చేసే బాధ్యత ప్రభుత్వానిదని, చేయించుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందని అన్నారు. కర్నే తండా లిఫ్టు పనులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రారంభించిన అనంతరం తాండలకు నీరందించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ మెగా రెడ్డి జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చందు నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్,తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News