విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం.. జేఎన్టీయూ వీసీ బాలకిష్డారెడ్డి..

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వినూత్న సంస్కరణలకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ జేఎన్టీయూ వీసీ బాలకృష్ణారెడ్డి తెలిపారు.

Update: 2025-01-05 14:10 GMT

దిశ ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వినూత్న సంస్కరణలకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ జేఎన్టీయూ వీసీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలివి ఉంటే ఎక్కడ ఉండైనా పని చేసుకోవచ్చన్నారు. 2016 లో పార్లమెంటులో చట్టం స్పేస్ లా చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించానన్నారు. రాష్ట్రంలో త్వరలో సెట్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వచ్చే వారంలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జేఎన్టీయూలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. క్లీన్‌ జేఎన్టీయూ, గ్రీన్‌ జేఎన్టీయూ చేపడుతున్నామన్నారు.

త్వరలో విద్యార్థులకు నిపుణులతో మెటీరియల్ రూపొందించి అందిస్తామన్నారు. దోస్త్ ప్రక్రియలోటు పాట్లను పరిశీలిస్తామన్నారు. తనకు గ్రామీణ‌ నేపథ్యం ఉందని, ఇక్కడ చదివే ఈ స్థాయికి చేరుకున్నా అన్నారు. నాగర్‌ కర్నూల్ ప్రాంత వాసిగా ఇక్కడ విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంఎల్సీలు ఈ విషయమై వివరించారన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ పతనం అంచునకు వచ్చిందని అన్నారు. ఉన్నత విద్యామండలిలో సరిగ్గా నియామకాలు లేవని, నిధులు కావాలి అని, దీని పై సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించామని అన్నారు. రాబోయే 3, 4 నెలల్లో కొన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు.


Similar News