'పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడతాననడం దురదృష్టకరం..'

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెడతాననడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-07 09:03 GMT

దిశ, మక్తల్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెడతాననడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్ టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు హనుమంత ఆధ్వర్యంలో రైతుబంధు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తప్పడం పై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తహశీల్దార్ కార్యాలయం ముందు తలపెట్టిన నిరసనలకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే మక్తల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలలో రెండు పంటలను రైతులు సాగుబడి చేసుకుని, పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి రైతుల కళ్ళల్లో కేసీఆర్ ఆనందం చూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, చివరకు రైతుబంధు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. అనంతరం సతీష్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.


Similar News