జడ్చర్లలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన..

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ ఎస్వీకేయం అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.

Update: 2025-01-07 09:09 GMT

దిశ, జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ ఎస్వీకేయం అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి 33 జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిషన్లో తమ తమ ప్రదర్శనలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే జనం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈవో ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ జానకి పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి విద్యాశాఖ అధికారులు, పెద్దలు పాల్గొన్నారు.


Similar News