రైతులకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధం : R. S. Praveen Kumar

రైతులకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Update: 2022-12-10 12:06 GMT

దిశ, మరికల్ : రైతులకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని పేర్కొన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలోని 449 భూ బాధిత రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గుండాగిరి చేస్తూ తన అనుచరులతో అక్రమంగా భూములు గుంజుకునే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. తన అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం పేదల అసైన్డ్ భూములను లాక్కుంటే బీఎస్పీ ఊరుకోదన్నారు. రైతుల కోసం జైలుకెళ్లాడనికైనా తాము సిద్ధమేనని అన్నారు. అనంతరం చిత్తనూరు గ్రామ రైతులు,ప్రజలు చేస్తున్న జూరాల బయోడీజిల్ ఆగ్రో కంపెనీ రద్దు పోరాటానికి మద్దతు ప్రకటించారు. కొంత మంది కార్పొరేట్ శక్తుల కోసం బయో డీజిల్ కంపెనీ ఏర్పాటు చేసి వేల మంది ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కంపెనీ అనుమతులు రద్దు చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించింది భూములు లాక్కోవడానికా అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి లాంటి దోపిడీ దొంగలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ బొదిగెలి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా ఇంఛార్జి అర్జున్ రాజ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జట్ల నరేందర్, మక్తల్ అసెంబ్లీ ఇంఛార్జ్ పాలెం వెంకటయ్య, అధ్యక్షుడు కందుకూరి శ్రీనివాసులు, పేట అసెంబ్లీ అధ్యక్షుడు హమ్మంతు, మరికల్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు, రాజు, చెన్నయ్య, బీఎస్పీ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్, రవి యాదవ్, శ్రీను ముదిరాజ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News