అచ్చంపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్

అచ్చంపేట మండల నూతన ఎస్సైగా బుధవారం రమేష్ బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-10-10 05:35 GMT

దిశ, అచ్చంపేట రూరల్: అచ్చంపేట మండల నూతన ఎస్సైగా బుధవారం రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు అమ్రాబాద్ మండల ఎస్సై గా విధులు నిర్వహించారు. అచ్చంపేట ఎస్సైగా ఉన్న రాములు నారాయణపేట విఆర్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వివరించడం జరుగుతుందని వారు తెలియజేశారు.


Similar News