ప్రియాంక గాంధీ పర్యటనను విజయవంతం చేయాలి : పటేల్ ప్రభాకర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ లో విద్యార్థి నిరుద్యోగ గర్జనకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కోరారు.
దిశ, గద్వాల : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ లో విద్యార్థి నిరుద్యోగ గర్జనకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగ బతుకులు ఆగమ్య గోచరంగా మారాయన్నారు. తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా ఫీజులను దండుకుంటున్నారని ఆరోపించారు.
కాయ కష్టం చేసి సంపాదికించుకున్న కొద్దిపాటి డబ్బులను కూడా నిరుద్యోగులు అప్లికేషన్ల కోసం ఖర్చు పెడుతున్నారని చెప్పారు. నోటిఫికేషన్ తీరా అప్లికేషన్ల వరకే పరిమితం అవుతుందే తప్ప ఉద్యోగాలను ఇవ్వడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ గర్జనకు జిల్లా నలుమూలల నుండి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసాక్, తదితరులు ఉన్నారు.