సోమవారం ప్రజావాణి రద్దు..ఎందుకంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో..జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో..జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అధికారులకు సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షల విధులను కేటాయించినందుకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి దరఖాస్తులతో కలెక్టర్ కార్యాలయానికి రావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.