పడమటి అంజన్నను దర్శించుకున్న మంత్రి
మక్తల్ పడమటి ఆంజనేయస్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు
దిశ, మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయస్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. పడమటి అంజన్న ఉత్సవాలు భాగంగా నేడు రథోత్సవం సందర్భంగా..స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రికు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దాదాపు 70 సంవత్సరాల చరిత్రలో పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల్లో క్యాబినెట్ హోదా గల మంత్రి పాల్గొనడం ఇది మొదటిసారి. ముందుగా అతి పురాతనమైన నల్లజానమ్మ అమ్మవారి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద బ్రాహ్మణులు ఆలయ వంశపారం పర్య పూజారి ప్రాణేషాచారి ఆశీర్వాదాలు అందించారు. మంత్రి కొండా సురేఖకు మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి విశిష్టత ఆలయ చరిత్ర ప్రసాదాలను ఇచ్చారు.