వైభవంగా అంజన్న స్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీ వ్యాస రాయల మహర్షి చ్చే ప్రతిష్టించబడిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
దిశ,ఊట్కూర్ : శ్రీ వ్యాస రాయల మహర్షి చ్చే ప్రతిష్టించబడిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతం ప్రత్యేక పుష్పాలంకరణ మంగళహారతితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బురుజు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.